Mahadevuda Mahonnathudu
మహాదేవుడా మహోన్నతుడు
మహాదేవుడా – మహోన్నతుడు
ఆశ్చర్యమే నీ కార్యములు – అందవు నీ బలశౌర్యములు
ఆరాధన – ఆరాధన
ఆశ్చర్యకరుడా – నా యేసయ్యా
1. మీరిన నేరానికి – అగ్ని పాలైన నీ వారిని
అగ్ని నుండి విడిపించినావు – అగ్ని బలమును చల్లార్చినావు
అందరి యెదుట ఘనపరచినావు
అతిశయించి జయించినావు
॥ ఆరాధన ॥
2. అయినవారి ద్వేషాలతో – అమ్మబడిన నీ దాసుని
అన్యదేశములో ఘనపరచినావు – అధికారినిగా నియమించినావు
అన్నలనే సాగిల పడజేసినావు
అతిశయించి జయించినావు
॥ ఆరాధన ॥
3. ఐగుప్తు విడచిన నీ వారిని అడ్డగించిన జలరాశిని
అతి చిత్రముగ విభజించినావు – ఆరిన నేలను కలిగించినావు
ప్రజలందరిని దాటించినావు – తరిమిన వారిని హతమార్చినావు
అతిశయించి జయించినావు