Marana Shaasana Kartha

మరణ శాసనపు కర్త

మరణ శాసనపు కర్త – మరణపు ముళ్ళతో గుచ్చ బడితివా
భూమి నిర్మాణ కర్త – సమాధి గుహలో పెట్టబడితివా (2)
నా పాపము నిమిత్తమై – దూషివని తీర్పునొందితివా
నా పాప విమోచనముకై – శాపగ్రాహిగా మారితివా
కల్వరి గొర్రె పిల్లా.. (4)

||మరణ శాసనపు కర్త||

బాల్య వయసు దినముల నుండి తలంపుల ఊహా అంతయు
కేవలము చెడ్డది కాగా పాపినైపోతిని (2)
నశించిన వారిని వెదకి రక్షించుటకు
పరము విడచి మానవుడిగా భువికి దిగివచ్చితివి (2)
నా పాప భారమును సిలువలో భరియించితివి

కల్వరి గొర్రె పిల్లా.. (4)

||మరణ శాసనపు కర్త||

మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్ష ఫలము
ఆజ్ఞ విషయమై అతిక్రమ పరిహారముగా మరణశిక్ష వచ్చెను (2)
కడపటి ఆదాముగా జీవింపజేయుటకు
ప్రేమా స్వరూపివై శిక్ష రద్దు చేసితివి (2)
మానవాళి మరణమును సిలువలోన పొందితి వి
కల్వరి గొర్రె పిల్లా.. (4)

||మరణ శాసనపు కర్త||

లోక పాపమును మోసే దేవుని గొర్రె పిల్లగా
ఈ లోక రాజుల ఎదుట మౌనివై వుంటివి (2)
కొరడాలతో కొట్టిరి ప్రక్కన పొడిచితిరి
మోముపై ఉమ్మి వేసి అపహాస్యము చేసితిరి (2)
నిత్యత్వమిచ్చుటకు సిలువను సహించితివి

కల్వరి గొర్రె పిల్లా.. (4)

||మరణ శాసనపు కర్త||