Bahu Soundharya Siyonulo
బహు సౌందర్య సీయోనులో స్తుతి
బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా (2)
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై – నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీవాక్యమే – నాకిలలోన సంతోషమే…..
|| బహు సౌందర్య ||
1. పరిశుద్ధతలో మహనీయుడవు – నీవంటి దేవుడు జగమున లేడు (2)
నాలో నిరీక్షణ – నీలో సంరక్షణ – నీకే నా హృదయార్పణ (2)
|| బహు సౌందర్య ||
2.ఓటమి నీడలో క్షేమము లేక – వేదన కలిగిన వేళలయందు (2)
నీవు చూపించిన నీ వాత్సల్యమే – నా హృదయాన నవజ్ఞాపిక (2)
|| బహు సౌందర్య ||
3.ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు – చల్లని నీ చూపే ఔషధమే (2)
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం – నాలో నింపెను ఉల్లాసమే (2)