Prema Swarupuda

ప్రేమా స్వరూపుడా

ప్రేమా స్వరూపుడా – ప్రేమించు దేవుడా !
నీ ప్రేమ నేను వర్ణించలేను
నీ జాలి లేక జీవించలేను
1. ఆదరణ లేక అల్లాడు వేళ
కన్నీళ్ళతో నే కుమిలేటి వేళ
నా స్థితిని చూచి నీ ఒడికి చేర్చి
కన్నీరు తుడిచిన కరుణామయా !

||ప్రేమా||

2. నా గోడు వినగా తోడెవరు లేక
ఒంటరి నేనై దిగులొందు వేళ
నా తోడు నీవై నీ దరికి చేర్చి
నన్నాదరించిన నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా

||ప్రేమా||