Poojaneeyudesu Prabhu

పూజనీయుడేసు ప్రభు

పూజనీయుడేసు ప్రభు
పలునిందల నొందితివా నాకై (2)

||పూజనీయుడేసు||

నీ స్వకీయులే నిందించినా
నిన్నంగీకరించక పోయినా (2)
ఎన్నో బాధ లొందితివా నాకై (2)
సన్నుతింతును నీ ప్రేమకై

||పూజనీయుడేసు||

సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి (2)
వంచకుడవని నిన్ను నిందించిరా (2)
ఓ దయామయా నజరేయుడా

||పూజనీయుడేసు||

యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా (2)
అధములు నిను సమరయుడనిరా (2)
నాథుడా నిను బహు దూషించిరా

||పూజనీయుడేసు||

మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నారాధింతును (2)
వధియించబడితివా యీ పాపికై (2)
వందితా ప్రభు నిన్ను పూజింతును

||పూజనీయుడేసు||