Prabhuva Nee Sannidhilo

ప్రభువా నీ సన్నిధిలో నివసించే నాకు

ప్రభువా నీ సన్నిధిలో నివసించే నాకు
ఎంత ధన్యమో – ఎంత భాగ్యమో

1. భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే
నీ పాద సన్నిధిలో – నిలుచుటయే మేలు
నీ మందిర ఆవరణములో నాటబడిన నా జీవితం
వాడిపోదు ఎన్నడూ – మోడుకాదు ఏనాడు

||ప్రభువా||

2. మలినమైన లోకాశలు తొలగించుకొని
మనసులోన నీ మాటలు ధ్యానించుకొని
సీయోను రాజువైన నిను మదిలో నిలుపుకొని
నీ ప్రేమ కౌగిలిలో నేను పరవసించెద

||ప్రభువా||