Punaruddanuda Vijayashiluda
పునరుత్థానుడా విజయశీలుడా
పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాధుడా (2)
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా (2)
|| పునరుత్థానుడా ||
కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య (2)
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య (2)
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2}
|| పునరుత్థానుడా ||
మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా (2)
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా (2)
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా (2)
|| పునరుత్థానుడా ||
నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య (2)
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా (2)
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య (2)