Nenu Vellemargamu

నేను వెళ్ళేమార్గము నా యేసుకే తెలియును

నేను వెళ్ళేమార్గము – నా యేసుకే తెలియును (2)
శోదింప బడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)

||నేను వెళ్ళేమార్గము||

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2)
గురిలేని తరుణాన వెరవగ – నా దరినే నిలిచేవా నా ప్రభు (2)

||నేను వెళ్ళేమార్గము||

జలములలో బడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2)
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు (2)

||నేను వెళ్ళేమార్గము||

విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా – నాయెదుటేనిలిచేవా నా ప్రభు (2)

||నేను వెళ్ళేమార్గము||