Neeve Krupadharamu Triyeka deva
నీవే కృపాధారము త్రియేక దేవా
నీవే కృపాధారము త్రియేక దేవా – నీ
వేక్షేమాధారము నా యేసయ్యా
నూతన బలమును నవనూతన కృపను – (2)
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా
ఆనందించితి అనురాగబంధాన –
ఆశ్రయపురమైన నీలో నేను (2)
ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ
ప్రమనుచూపి (2)
ఆపదలెన్నో అలుముకున్ననూ
అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా – ఈ
స్తోత్రగీతం నీకేనయ్యా
|| నీవే ||
ప్రార్థించితిని ప్రాకారములను – దాటించగలిగిన
ప్రభువే నీవని (2)
పరిశుద్ధతకై నియమించితివి –
నీరూపమునాలో కనపరచుటకు (2)
పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
పరమరాజ్యములో చేర్చుటకొరకు
అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక
స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ
స్తోత్రగీతం నీకేనయ్యా
|| నీవే ||
సంపూర్ణతకై సంతృప్తి కలిగి – సిలువను
మోయుచు నీతో నడిచెద (2)
సుడివడిననా బ్రతుకును మార్చితివి –
సింహాసనముకై నను పిలచితివి (2)
శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ
స్తోత్రగీతం నీకేనయ్యా