Nee Prema Naalo Madhuramainadhi

నీ ప్రేమ నాలో మధురమైనది

నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే

|| నీ ప్రేమ నాలో ||

చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో – కాదనలేదే
నా మనవును నీవు (2)

హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)

|| నీ ప్రేమ నాలో ||

నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)

ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)

ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)

|| నీ ప్రేమ నాలో ||

నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)

కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2)

|| నీ ప్రేమ నాలో ||