Nee paata paadedhanu

నీ పాట పాడెదను నా యేసయ్యా

పల్లవి : నీ పాట పాడెదను – నా యేసయ్యా
నీ బాట నడిచెదను
హల్లెలూయా….హల్లెలూయా (4)

1. కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో (2)
వ్యాధి బాధలలో కాపాడరావా (2)

||హల్లెలూయా||

2. పనిచేసే వేళ భుజియించే వేళ (2)
నిదిరించే వేళలలో నిను తలతునయ్యా (2)

||హల్లెలూయా||

3. కరుణించే దేవా కాపాడరావా (2)
నా పాప భారం తొలగించరావా (2)

||హల్లెలూయా||

4. నా మనసు మారేనా చింత తీరే (2)
నా ఆత్మ నీకు అర్పింతునయ్యా (2)

||హల్లెలూయా||