Neeke Naa Aaraadhanaa

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా..

నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2)
యుగయుగములకు తరతరములకు
మహిమా ప్రభావము (2)
నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా..

||నీకే||

నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2)
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2)

||నీకే||

ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2)
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2)

||నీకే||

నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2)
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2)

||నీకే||