Ninne Sthuthiyinthunu
నిన్నే స్తుతియింతును
నిన్నే స్తుతియింతును – నిన్నే స్తోత్రింతును
నిన్నే ఘనపరుతును – నిన్నే ప్రకటింతును
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
నా తోడు నీడవు నీవేనయ్యా
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
నా తల్లి తండ్రివి నీవేనయ్యా
1. పరమందు వేవేల దూతాళి
స్తుతుని ప్రతినిత్యము పొందువాడ
కోరి నిన్ను కొనియాడెదా – చేరి నిన్ను కీర్తించెదా
॥యేసయ్యా||
2. పరలోకమును వీడి ఈ పాపి కొరకై
భువిపైన ఉదయించినావా
కోటి వెలుగుల నీ తేజము – తాకి తరియించే నా జీవము