Ninne Thalachi Ninne

నిన్నే తలచి నిన్నే వలచి

నిన్నే తలచి – నిన్నే వలచి
దేవుడే మనుష్యుడైన చిత్రము చూడుమా
ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా
హృదయమా హృదయమా నాహృదయమా

యేసయ్య ప్రేమను గాంచుమా
ప్రాణమా -ప్రాణమా నా ప్రాణమా
యేసయ్యా స్నేహము గోరుమా

॥నిన్నేతలచి।।

1. స్థిరమే లేని మనుషుల ప్రేమలు -నటనయే చూపుచు కదిలే బొమ్మలు
కలుగజేయునే నీకు గాయము – చేయలేవులే ఏ సాయము
గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య
సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును యేసయ్య
నీలో నిలచి – నీతో నడచి
మార్గమే చూపిన మంచి దేవుడు
అనురాగమే పంచిన ఆత్మీయుడు

॥నిన్నేతలచి।।

2. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమెందుకు
నమ్మదగినవాడు నీ దేవుడు – సర్వకాలము నిన్ను విడువడు
వాగ్దానమే నీకుండగ – భయమేలనే ప్రాణమా

వర్ణింపగ సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ
నిన్నే పిలిచి – తనలా మలచే
యేసుపై ఆనుకో నా ప్రాణమా
ఆ యేసును నమ్ముకో అంతరంగమా

॥నిన్నేతలచి।।