Nuthana Parachumu Deva

నూతన పరచుము దేవా

నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను –
నూతనపరచుము నా సమస్తము (2)
పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును

||నూతన ||

1.శాశ్వతమైనది నీదు ప్రేమ –
ఎన్నడైన మారినది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా –
నాయెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)

||పాతవి||

2.ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను
ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల
చేసినావు నీకే స్తోత్రము (2)

||పాతవి||