Naa Balamaa Ninne

నా బలమా నిన్నే కీర్తింతునూ

నా బలమా నిన్నే కీర్తింతునూ
నా శైలమా నిన్నే స్తుతియింతునూ
స్తుతియించి స్తుతియించి స్తోత్రింతునూ
పొగడి పొగడి పాడెదనూ

1. పరాక్రమము ప్రభావము – పరిశుద్ధుడవు నీవే
వేకువనే లేచి వెదకెదనూ ఉత్సాహ గానము చేసెదను

||స్తుతియించి|| ||నా బలమా॥

2. దివి యందూ భువి యందు
ఆకాశ మందు అధికారి నీవే
స్తుతి మహిమలు నీకే ఆరోపింతును
స్తుతిగానములే చేసెదనూ…

॥స్తుతియించి|| ||నా బలమా॥