Naa Priyudu Najareyudu
నా ప్రియుడు నజరేయుడు
నా ప్రియుడు నజరేయుడు
నా దేవుడు ఉన్నవాడు
ఆనందభరితుడనై – అతని నీడలో
నిత్యము నిలచి యుందును
॥నా ప్రియుడు||
1. ద్రాక్షారసములకన్నా మధురము ఆ ప్రేమా…
దాచునన్ను కౌగిలిలో – నా యేసు ప్రేమా..
పరిమళాల కన్నా పరవశమైనా…
ప్రేమయైయున్నాడు నా దేవుడు
॥నా ప్రియుడు||
జలరాశుల గలగలలు పోలిన ఆ స్వరము
హిమమంత ధవళమును కలిగిన ఆ శిరము
అగ్నివంటి నేత్రాలు – అపరంజి పాదాలు
కలిగివున్నవాడు నా ఇమ్మానుయేలు