Naa Priyuda Yesunadha

నా ప్రియుడా యేసునాధా

నా ప్రియుడా యేసునాధా – నీకే స్తోత్రములు
నీవే నా ప్రాణం – నీవే నా జీవం – నీవే నా సర్వం
నీవే నా ఆశ్రయము అయ్యా ….

1. ప్రధాన పాపిని పశుప్రాయుడను – నిన్ను విడిచి తిరిగినాను
నీకు దూరమయ్యాను – ఐనా ప్రేమించావు పాపాలు క్షమించావు
నా కుమారుడా అన్నావు నీ పరిచర్య చేయమన్నావు

2. ఏ మంచి లేదయ్య నన్ను ప్రేమించావు
ఏమిచ్చి నీ ఋణం తీర్చనయ్యా ఏమిలేని దరిద్రుడను
నిరుపేదను నేను ఏమివ్వలేనయ్య

3. బ్రతుకలేనయ్యా – నీవు లేక క్షణమైన
బ్రతికించుము నీదు కృపతో – బలపరచుము నీ సేవలో
నీవే దయాళుడవు – నీవే నా దేవుడవు
కరుణించవా నా ప్రియుడా
నీ కృప నిత్యముండును గాక