Naa Praana Deepama
నా ప్రాణ దీపమా
నా ప్రాణ దీపమా – నా తోడు నేస్తమా
నేనంటే అంత ప్రేమ – నా కొరకే నా ఈ శ్ర
1. న్యాయాధిపతి నీవైయుండి – తీర్పుకు నిలిచావే
నా దోషములు నీవు వహించి శిక్షను కోరావే
నింగిని వీడిన నీతి సూర్యుడా – నేలకు ఒరిగావే
చీకటి నిండిన ఈ లోకానా వెలుగై నిలిచావే
॥నా ప్రాణ దీపమా ॥
2. కరుణతో నిండిన కన్నులలోన రుధిరము ఒలికేనే
వస్త్రము తాకిన స్వస్థత నిచ్చిన దేహము నలిగేనే
అంధుల కన్నులు తెరిచిన చేతుల మేకులు నాటేరే
దీనుల కోసం నడచిన పాదాలు నెత్తుట తడిచేనే
॥నా ప్రాణ దీపమా ॥
3. కాంతులు చిందే చక్కని మోమే తప్పేనే కళలు
కఠిన హృదయులు గుచ్చిన ఆ ముళ్ళు తలపై గాయాలు
కలువరి దారిలో కరుణామయునికా కఠిన యాతనలు
మమతను పంచిన ప్రేమామయునికా మరణ వేదనలు