Naa Thalli Nanu Marachinaa

నా తల్లి నను మరచినా

నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా (2)
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా (2)
యేసయ్యా హల్లెలూయా (4)

|| నా తల్లి ||

స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా (2)
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా (2)

||విడువని||

లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా (2)
సాతానే నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా (2)

||విడువని||