Naa Jesta Bhagaswami
నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతిచరామి
నా జ్యేష్ఠ భాగస్వామి – నీతోనే నాతిచరామి
ఎవరేమన్న నేమి నీ మాటే నాకిల హామీ
నీ కృప చాలు యేసు స్వామి
కృపచాలు యేసు స్వామి – నీ మాటే నాకిల హామీ
1. కరువులెన్నైన రాని – కష్టమేదైన కాని
నా కాపరివై నీవు ఉండగ నాకు కలుగదు లేమి
||కృపచాలు||
2. కలతలెన్నైన కాని – ఖడ్గమే ఎదురు రాని
నాకు కేడెమై నీవు ఉండగ హాని కలుగదు ఏమి
||కృపచాలు||
3. నిందలేవచ్చి పడని – మిత్రులే శత్రులవని
నన్ను వీడని ఆత్మ దేవుడా నాకు చాలు నీ చెలిమి