Naa Chinni Hrudayamu

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ

||నా చిన్ని||

కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2)
నా ప్రాణము నీకై యెదురు చూడనీ

||నా చిన్ని||

దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2)
నా ప్రాణము నిన్నే ఆశింపనీ

||నా చిన్ని||

పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2)
నా కన్నులు నీపైనే నిలచియుండనీ

||నా చిన్ని||