Nakemi koduva naadhudunda

నాకేమి కొదువ నాధుడుండ

నాకేమి కొదువ – నాధుడుండ నింక = శ్రీకరుండగు దేవుడే నా – శ్రేష్ఠ పాలకుడు – నా – యేక రక్షకుడు గనుక

||నా కేమి||

1. తనివి దీరన్ మే – ళ్లనుభవింప – నేను = నను సదా మేళ్లనెడి పచ్చిక – నదిమి మృదువుగ – బండు – కొన జేయును గనుక

||నా కేమి||

2. ఎంత శోధన – యెండ యున్న = నాకు నెంతకు నోరిగర దెపుడు – శాంత జలములు – నా – చెంతనే యుండున్ గనుక

||నా కేమి||

3. తప్పిపోయిన నన్ – దారిం బెట్టి – నన్ను = తెప్పరిల్ల జేసి నాకు దీరు నలసటను – నా – తప్పు మన్నించున్ కనుక

||నా కేమి||

4. నీతి మార్గమునన్- నిల్పున్ నన్ను – ప్రభువు = నీతి లేని నాకు దన సు – నీతి దయచేయున్ – స్వ – నీతిని ద్రుంచున్ గనుక

||నా కేమి||

5. చావు చీకట్ల – శక్తి యుండు – ఆహా = లోయలో బడి పోవలసినను – నే వెరవకుందు – నా – దేవుండే తోడు గనుక

||నా కేమి||

6. మీద బడునట్టి – శోధనలన్ – ధరను = నా దరికి రానీక దండము – నన్ను బ్రోచుచును – నా – కాదరణ యౌను గనుక

||నా కేమి||

7. పగ వారల్ సిగ్గు- పడునట్లుగ – నా = జగము యెరుగని సౌఖ్య భో – జన మగపరచును – హా – తగిన దే పెట్టున్ గనుక

||నా కేమి||

8. తన యాత్మానంద – తైలంబుతో – ప్రభువు = నను దినము తలయంటి విసుగు – కొనక తుడుచును – నా కన్నీళ్లన్ని గనుక

||నా కేమి||

9. పలువిధములైన భాగ్యములతో – తండ్రి = వెలుపలికి దిగ వెడలునట్టి – వెల గల గిన్నె – నా – కలిమిగా జేయున్ గనుక

||నా కేమి||

10. బ్రదుకంతటన్ గృ – పా క్షేమములు – నా = వదలకుండగ వచ్చు నాతో – సుదినములు గల్గ – నా – పదలు సంపదలౌ గనుక

||నా కేమి||

11. దురితంబు లుండు – ధరణి నాకు నిజము = నిరవు కాదిక నెప్పటికి నా – పరమ దేవుని – మం – దిరమె నా యిల్లు గనుక

||నా కేమి||