Naa Aradhanaku Yogyudavu

నా ఆరాధనకు యోగ్యుడవు నీవే

నా ఆరాధనకు యోగ్యుడవు నీవే యేసయ్యా
నా అక్కరలన్నియు తీర్చుదవు నీవే యేసయ్యా (2)
నా స్తుతులకు పాత్రుడవు నీవే యేసయ్యా
ఇశ్రాయేలు కాపరివి నీవే యేసయ్య (2)

||నా ఆరాధనకు||

1) యెహోషాపాతు విశ్వాసముతో
ఉపవాసం చాటించగా (2)
యూదా జనులు విశ్వాసముతో నిన్నే స్తుతించగా
బెరాకా లోయలోనా స్తుతులందుకున్న దేవా (2)
శత్రువులను హతమార్చి విజయమునిచ్చిన దేవా (2)

||నా ఆరాధనకు||

2. పౌలు శిలలు ప్రార్థించగా ప్రార్ధన విన్న దేవా
పాటలతో నిన్ను స్తుతించగా భూకంపము కలిగించావు (2)
చరసాల బద్దలయ్యే సంకెళ్లు విడిపోయే (2)
బంధకాల నుండి విడుదల పొందెను (2)

||నా ఆరాధనకు||

3. ఇరువది నలుగురు నాలుగు జీవులు నిన్నే స్తుతించగా
ప్రతి జాతి వారు పరిశుద్ధ దూతలు నిన్నే కొనియాడగా (2)
గొర్రె పిల్ల పెళ్లి కొరకై సంఘాన్ని పిలచినావు (2)
సూర్యుడు చంద్రుడు నీవై వెలుతురును ఇచ్చిన దేవా (2)

||నా ఆరాధనకు||