Devuniki Sthothramu

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
ఇశ్రయేలీయులను పోగుచేయువాడని

||దేవునికి||

గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని

||దేవునికి||

నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని

||దేవునికి||

ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని

||దేవునికి||

దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి

||దేవునికి||

ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని

||దేవునికి||

పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును

||దేవునికి||

గుర్రముల నరులందలి బలము నానందించడు
కృప వేడు వారిలో సంతసించువాడని

||దేవునికి||

యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని

||దేవునికి||

పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును

||దేవునికి||

భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును

||దేవునికి||

వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనముకీలాగున చేసియుండలేదని

||దేవునికి||