Devaa Nee Thalampulu

దేవా నీ తలంపులు అమూల్యమైనవి

దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ
నా యెడల నీ కరుణ
సర్వ సదా నిలుచుచున్నది (2)

|| దేవా ||

స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే
స్తుతి పాడేను హృదయముతో (2)
స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2)
నీవే నా రక్షకుడవని

|| దేవా ||

మొదట నిన్ను ఎరుగనైతిని
మొదటే నన్ను ఎరిగితివి (2)
వెదుకలేదు ప్రభువా నేను (2)
వెదకితివి ఈ పాపిని

|| దేవా ||

అద్భుతమైనది సిలువ దృశ్యం
ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2)
ప్రభును వర్ణింప నశక్యము (2)
ప్రభువే సహించె దుఃఖము

|| దేవా ||

ఎట్లు మౌనముగా నుందు ప్రభు
చెల్లింపక స్తోత్ర గీతము (2)
కాలమంతా పాడుచుండెద (2)
నీ ప్రేమ అపారమైనది

|| దేవా ||