Deva Naa Mora Vinava

దేవా నా మొర వినవా

దేవా నా మొర వినవా – నా ప్రార్ధన ఆలకించవా..
నాపాపము నన్ను తరుమగా – నా ప్రాణము తల్లడిల్లగా..
నీ చెంతకు చేరినానయ్యా – నీ శరణే కోరినానయ్యా

॥దేవా॥

1. గాలికి ఊగేరెల్లెనా మనసు
నెమ్మది లేక కదులుచున్నది
చేసిన దోషములు నన్ను తరుమగను
వేదనతో హృదయం అదురుచున్నది
క్షమియించువాడ నాయేసురాజు
ఈ ఘోరపాపిని క్షమియించుమా

॥దేవా॥

2. గతించిపోయే లోకపు నటనలు
స్థిరమని నమ్మి మోసపోతిని.
గమ్యం తెలియని, జీవిత యాత్రలో
గతియేమవ్వునో ఎరుగనైతిని.
నడిపించువాడ నా యేసురాజు
నీ చేతితో నన్ను దరిజేర్చుమా

॥దేవా॥