Deva Dharshinchuma

దేవా దర్శించు మా దేశం

దేవా దర్శించు మా దేశం – మా భారతదేశం
విజ్ఞాపనలు చేశాము – మా దేశ ప్రజలకోసం
దేశ ప్రజలకోసం – ప్రియమైన ప్రజలకోసం

1. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే -కాచుకొని కూర్చున్నాము
ప్రతి ఒక్కరిని రక్షించుమని నిన్నే వేడుకున్నాము
ప్రేమ గలిగిన యేసు దైవమా – నీవే మాకు శరణం
పాపుల కోసం చిందియున్ననీ – రక్తమే మాకు అభయం

॥దేవా దర్శించుమా॥ ॥దేవా॥

2. మా సోదరుల పాపములన్నీ మేమే – నీ కడ ఒప్పగను
శాపము నుండి మా ఈ జనులు – దేవా విడుదల పొందగను
నీతి సూర్యుడా నీదు వెలుగును – భారతదేశము చూడగను
నీదు జ్ఞానము నీతి మార్గము – ప్రజలంత పొందగను

॥దేవా దర్శించుమా॥ ॥దేవా॥

3. నిన్ను నమ్మిన దీనులందరిని – సత్యమందు స్థిరపరచగను
సత్ ప్రవర్తన కలిగినవారై – మంచి సాక్ష్యము పొందగను
దేశమంతట నీదు వార్తను – నిండు ప్రేమతో చాటగను
క్రీస్తు తత్వమే మార్గదర్శమని – జనులందరికి తెలుపగలను

॥దేవా దర్శించుమా॥ ॥దేవా॥