Deva Drustinchu maa Desham

దేవా దృష్ఠించు మా దేశం

దేవా దృష్ఠించు మా దేశం
నశించు దానిని బాగుచేయుము (2)
పాపము క్షమియించి స్వస్థపరచుము
శాపము తొలగించి దీవించుము (2)

దేశాధికారులను దీవించుము
తగిన జ్ఞానము వారికీయుము
స్వార్ధము నుండి దూరపరచుము
మంచి ఆలోచనలు వారికీయుము
మంచి సహకారులను దయచేయుము దేవా (2)
నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి

|| దేవా దృష్ఠించు ||

తుఫానులెన్నో మాపై కొట్టగా
వరదలెన్నో ముంచి వేయగా
పంటలన్నీ పాడైపోయే
కఠిన కరువు ఆసన్నమాయే
దేశపు నిధులే కాలీయాయే (2)
బీదరికమూ నాట్యం చేయుచుండె

|| దేవా దృష్ఠించు ||

మతము అంటూ కలహాలే రేగగా
నీది నాదని బేధం చూపగా
నీ మార్గములో ప్రేమ నిండివుందని
ఈ దేశమునకు క్షేమమునిచ్చునని
క్రైస్తవ్యము ఒక మతమే కాదని (2)
రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రీ

|| దేవా దృష్ఠించు ||