Deva Jaali Chupumu
దేవా జాలి చూపుము
దేవా జాలి చూపుము
నా ప్రార్ధన నీవు ఆలకించుము
1. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము
హేయమైన మాటలు పలకకుండా – నా నాలుక అదుపు చేయుము
శరీరమందు ఏ పాపమునూ ఏలనీయకుము
||దేవా జాలి||
2. అల్పకాల భోగము ఆశించకుండా – నీ కొరకే బ్రదుకనీయుము
క్షణికమైన వాంఛలను కోరకుండా – నా హృదయం శుద్ధి చేయుము
నా జీవితమంతా నీదు చిత్తమే నెరవేర్చ కృపచూపుము
||దేవా జాలి||
3. చెయ్యగలిగినంత మేలు పొరుగువారికి
చేయుటకు మనసునీయుము
నశియించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తినీయుము
నా బ్రతుకు ద్వారా లోకానికి నీ నీతి ప్రకటింపనిమ్ము