Dhuramaithiva Naa Kannabidda
దూరమైతివా నా కన్నబిడ్డా దూరమైతివా
తండ్రి: దూరమైతివా నా కన్నబిడ్డా దూరమైతివా నా కన్నబిడ్డా (చిన్న)
కన్నతండ్రి నొదిలి – సొంతయిల్లు విడిచి
ఎచట తిరుగుచుంటివి ముద్దుబిడ్డా మురిపాల బిడ్డా
కొడుకు: దూరమైతిని నా కన్నతండ్రి – ఘోరమయ్యెను నా బ్రతుకు
లోకమాయనమ్మి నీకు దూరమయ్యి
వేదనతో తిరుగుచుంటి కన్నతండ్రి నా మంచితండ్రి
తండ్రి : కానివారి స్నేహానికి కావాలని వెళ్ళావు – క్షేమంగా ఉన్నావా కన్నబిడ్డా
నా కడుపుతీపి నెరుగవా కన్నబిడ్డా
॥దూరమైతివా||
కొడుకు: నమ్ముకున్న స్నేహాలు నయవంచన చేశాయి
దిక్కులేనివాడనైతి కన్నతండ్రి
నే బిక్కుబిక్కుమంటు ఉంటి కన్నతండ్రి
ఏ దిక్కులేని వాడనైతి కన్నతండ్రి
తండ్రి : కొంచెము ఆలస్యమైన ఉండలేవు ఆకలికి
అన్నమైన తిన్నావా కన్నబిడ్డా
నువ్వు ఆకలితో ఉన్నావా కన్నబిడ్డా
॥దూరమైతివా||
కొడుకు: ఆకలితో అలమటించి పస్తులతో బ్రతుకుచుంటి
పందులు తిను పొట్టుకై కన్నతండ్రి
నే పనివానిగ మారితిని కన్నతండ్రి
అది కూడా కరువయ్యె కన్నతండ్రి
॥దూరమైతివా||
తండ్రి: కనుదూరమైన నిన్ను కలవరించే నా హృదయం
పరితపించుచుంటిని ముద్దుబిడ్డా నీ కొరకే చూచుచుంటిని కన్నబిడ్డ
నీ కొరకే వేచియుంటి ముద్దుబిద్దా
॥దూరమైతివా||
కొడుకు: నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు
తప్పునాకు తెలిసింది కన్నతండ్రి
నా తప్పు దిద్దుకుంటాను కన్నతండ్రి
నీ పనివానిగా ఉంటాను కన్నతండ్రి
॥దూరమైతివా ||