Dhaaveedu Kumaarudaa Yesu
దావీదు కుమారుడా యేసు నా ప్రాణనాధుడా
దావీదు కుమారుడా యేసు నా ప్రాణనాధుడా (2)
నిత్యము నీ నీడలో జీవింతును
నిత్యము నీ సేవలో జీవింతును
||దావీదు కుమారుడా||
1. నా బలిపీఠమా హృదయ అర్హులు నీకేనయ్యా
నా జయసింహమా నా జయమంతా నీదేనయ్యా (2)
నేను బ్రతికేదను నీ సన్నిధిలో చిగురించు ఒలీవనై (2)
||దావీదు కుమారుడా||
2. శ్రీమంతుడా పరలోక నిధులన్నీ నీవేనయా
నా ఐశ్వర్యమా ఆ సంపదలు నీవేనయ్యా (2)
అప్పగించెదను ఈ ఆత్మలను పరలోక సన్నిధిలో (2)
||దావీదు కుమారుడా||
3. నా స్తుతిగోత్రమా స్తుతికి అర్హుడవు నీవేనయ్యా
నాదేదోప్యమా నిత్య సీయోను నీవేనయ్యా (2)
నా హృదయములో కొలువున్నది నీ రాజ్య మర్మములే (2)