Thodu Lerani Kumilipoku

తోడు లేరని కుమిలిపోకు

తోడు లేరని కుమిలిపోకు
యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
ఓహో సోదరా యేసే నీ గురి (2)

|| తోడు ||

ఆదరణ లేక అల్లాడిపోకు
శోధన వేదనలో కృంగిపోకు (2)
ఆదరించే వాడే యేసు
అల్లాడిపోకు ఓ సోదరా (2)

|| ఓహో సోదరా ||

విడువడు యేసు ఎడబాయడెన్నడు
అనుక్షణము నిన్ను కాపాడును (2)
ఆయన మీదనే భారము మోపు
ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)

|| ఓహో సోదరా ||