Jeeva Jalama Shekeena

జీవ జలమా షెకీనా మేఘమా

జీవ జలమా షెకీనా మేఘమా
నాపై చూపిన అనురాగమా
నాపై నింపిన అభిషేకమా
స్తోత్రబలి స్తోత్రబలి చేసెదనయ్యా
స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా

॥జీవ జల||

1. విడువని ఎడబాయని ఆత్మదేవుడా
సర్వసత్యమందు నడుపు నీతి సూర్యుడా

స్తోత్రబలి స్తోత్రబలి చేసెదనయ్యా
స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా

॥జీవ జల||

2. వేదన పడు వేళలో వెలుగువు నీవే
ఆదరణ కర్తవై ఆదుకొంటివే
స్తోత్రబలి స్తోత్రబలి చేసెదనయ్యా
స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా

॥జీవ జల||

3. కన్నతల్లి మరచినా మరువనంటివే
కునుకక నిదురించక కాయుచుంటివే
స్తోత్రబలి స్తోత్రబలి చేసెదనయ్యా
స్తుతియాగము నీకే అర్పించెదనయ్యా

॥జీవ జల||