Jaalari O Jaalari

జాలరీ ఓ జాలరీ

జాలరీ ఓ జాలరీ – కాపరీ నా మంచికాపరి
మనుషుల పట్టు జాలరీ – ఆత్మలకాయు కాపరి

॥జాలరీ॥

1. శోకపు సముద్రాలలో – శోధన కెరటాలలో
నిలువరమే లేనీ – చిన్ని చేపనయ్యా
మనసున్న మంచి జాలరీ – చేర్చవా నీ వలలోకి

॥మనుష్యుల ॥ జాలరీ॥

2. చీకటి మార్గాలలో – లోకాశల ముళ్ళ కంచెలో
తిరుగులాడుచున్న – చిన్ని గొర్రెనయ్యా
మనసున్న మంచి కాపరీ – చేరవా నా దరి

॥మనుష్యుల ॥ జాలరీ॥