Janminche Janminche

జన్మించె జన్మించె రారాజు జన్మించె

జన్మించె జన్మించె – రారాజు జన్మించె

చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే

అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె

పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే

ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని

నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2)

హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్

విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్

హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్

విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

దూతకు భయపడి వణికిరి గొల్లలు

శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2)

సంతోషముతో ఆనంద గానముతో

యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2)

||ఊరూ వాడా||

తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు

యేసే రాజని అర్పించిరి కానుకలు (2)

ఆరాధించి హృదయములను అర్పించి

భువినేలే రారాజును కీర్తించిరి (2)

||ఊరూ వాడా||

యేసే మార్గము యేసే సత్యము

యేసే జీవము ఇదియే నిత్యము (2)

మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే

విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2)

||ఊరూ వాడా||