Chekkumayya
చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో
చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో
నడుపుమయ్యా నన్ను నీ ఏలికలో (2)
శిల్పకారుడా స్వల్ప జీవితం (2)
మలచుము నన్ను నీ అనుకూలముగా (2)
|| చెక్కుమయ్యా ||
1. మరణపాత్రమైన ఈ నా జీవితం
మహిమ రాజ్యము చేర్చుకొనుటకు (2)
మార్చుము నన్ను నీ పోలికలో
మెరుగుదిద్దుము నన్ను నీ హస్తముతో (2)
|| చెక్కుమయ్యా ||
2. మిగిలిపోయిన ఈ నా జీవితం
మస్టు పోవునట్లు పుటము వేయుము (2)
పరిపూర్ణ స్వారూప్యము కనబడు వరకు
తీర్చి దిద్దుము నన్ను జీవ వాక్యముతో (2)