Chudumu Ee Kshaname
చూడుము ఈ క్షణమే కల్వరిని
చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా
1. మానవులెంతో చెడిపోయిరి మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని-నరకమున్నదని వారెరుగరు
2. ఇహమందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
॥చూ॥
3. మనలను ధనవంతులుగ చేయను దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము శ్రీయేసుని
4. సిలువపై చూడుము ఆ ప్రియుని-ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితము-ఆయన కొరకై జీవించుము